Thursday, 10 January 2019

మోటార్ వాహనముల చట్టము (క్రొత్తది Vs పాతది)


భారతదేశం లో బ్రిటిష్ వారు రాక మునుపటి నుంచి వాహనములు ను రవాణా కొరకు వాడియుండడం జరిగింది . కానీ రోడ్లు మరియు వాహనముల  యొక్క వ్యవస్థీకరణ పనులు, భారతదేశం బ్రిటిష్ రాజ్ లో చేరాకే జరగడం మొదలైంది. రోడ్ల పై ప్రవర్తనా నియమావళి రూపకల్పన కొరకు కొన్ని క్రొత్త శాసనములు , నియమములు , నిబంధనలు  యొక్క అవసరం ఏర్పడింది. అందుకని సులభమైన , కచ్చితమైన పరిపాలన కొరకు 1914 లో మోటార్ వాహనముల చట్టమును ప్రవేశ పెట్టడం జరిగింది.

"భారతదేశపు మోటార్ వాహనముల చట్టము, 1914" అనేది  కేంద్ర చట్టం, దీనిని బ్రిటిష్ ఇండియా కాలం లో ఆమోదించిండం  మరియు వర్తించడం జరిగింది. ఇది 18 విభాగాలను కలిగి ఉంది, ఈ చట్టము స్థానిక ప్రభుత్వాలకు  వాహనాలు మరియు వాహనదారులు యొక్క నమోదు, లైసెన్సింగ్ మరియు నిబంధనలను అమలు చేసే బాధ్యతను ఇచ్చింది. ఈ చట్టాన్ని 1940 నుండి అమల్లో వున్న  "మోటార్ వాహనముల చట్టము, 1939" తో భర్తీచేయడం జరిగింది.

సాంకేతిక పరిజ్ఞానం మరియు దేశ పురోగతి పెరగడంతో, చట్టాలకు కూడా మార్పులు  అవసరమయ్యాయి. ఇవన్నీ 1988 లో ప్రతిపాదితమైన తాజా మోటారు వాహన చట్టంకి దారితీసాయి .

2017 లో, సవరించిన మోటార్ వాహనముల చట్టమును  లోక్ సభ ఆమోదించింది, కానీ ప్రస్తుతం దీనికి ఇంకా  రాజ్య సభ నుండి ఆమోదమోక్షం లభించాల్సి వుంది.

96 శాతం మంది, ఈ బిల్లు ఆమోదం "2020 నాటికి 50% వరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించాలానే" ఐక్యరాజ్యసమితి ఆదేసాన్ని చేరుకునేందుకు  తోడ్పడుతుందని భావిస్తున్నారు. విధానాల రూపుకల్పన మరియు ఫిర్యాదుల పరిష్కారంలో పాల్గొనే , కన్స్యూమర్ వాయిస్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఒక సర్వే ప్రకారం :

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధికంగా  ప్రతీఏటా 1.46 లక్షల చొప్పున మంది మన దేశంలో సంభవిస్తున్న రోడ్ల ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఈ బిల్లుకి  ఆమోదయోగ్యం లభించడంతో ఈ మరణాల సంఖ్య తగ్గుతుందని, కావున అన్నీ పార్టీల దీనికి మద్దతు పలకాలని , 97 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

ఈ బిల్లు ఇప్పటికే ఉన్న భాగాలలో చాలా కొత్త విభాగాలు మరియు సవరణలను చేర్చింది.

కొత్త మరియు పాత మోటార్ వాహన చట్టముల మధ్య వున్న వివిధ వ్యత్యాసాలు :

  • డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్ను  పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని ఈ చట్టం ప్రతిపాదిస్తుంది.
  • హిట్-అండ్-రన్ కేసులలో మరణాలకు, ప్రస్తుత పరిహారం కేవలం రూ .25,000 మాత్రమే. ఈ చట్టం బాధితుల కుటుంబానికి రూ .2 లక్షల లేదా అంతకన్నా ఎక్కువ పరిహారం చెల్లించాలని ప్రతిపాదిస్తుంది
  • బాలబాలికలచే ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిన యెడల , వారి యొక్క సంరక్షకుడు  లేదా వాహనం యొక్క యజమానిని బాధ్యమ్ చేయడం జరుగుతుంది . వారి జ్ఞానం లేకుండా నేరం జరిగిందని లేదా వారు నిరోధించడానికి ప్రయత్నించారని   నిరపించబడినంత వరకు వారు జవాబుదారీగా వ్యవహరిస్తారు. వాహనము యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది మరియు నేరానికి పాల్పడిన ఆ జువెనైల్ ను జ్యూనియల్ జస్టిస్ చట్టం కింద విచారణ చేయడం కూడా జరుగుతుంది.
  • ఈ బిల్లు మంచి మనసు తో ముందుకు వచ్చి సహాయం చేసే వారికి మరిన్ని సదుపాయాలను ,రక్షణను  కలిగిస్తుంది . ప్రమాద బాధితుల సహాయం కోసం ముందుకు వచ్చిన వారు, పౌర లేదా నేర బాధ్యత నుండి రక్షించబడతారు. పోలీసులు లేదా వైద్య సిబ్బందికి వారి గుర్తింపును బహిర్గతం చేయటం  వారి ఇష్టం. 
  • మద్యం సేవించి  వాహనం నడిపిన యెడల కనీస జరిమానా రూ .2,000 నుంచి రూ .10,000కు పెరిగింది.
  • రాష్ డ్రైవింగ్ కోరకు జరిమానా రూ .1,000 నుండి రూ .5,000కు పెరిగింది.
  • లైసెన్సు లేకుండా వాహనం నడిపిన యెడల , కనీస జరిమానా ప్రస్తుతం వున్న రూ. 500 నుండి రూ .5,000కు పెరిగింది
  • అతి  వేగంకు పాల్పడిన యెడల , జరిమానా రూ .400 నుండి 1,000-2,000 కు పెరుగుతుంది .
  • సీట్ బెల్ట్ ను పెట్టుకోకపోయిన యెడల , జరిమానా ప్రస్తుతం వున్న రూ .100 నుండి రూ .1,000కు పెంచడం జరిగింది 
  • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడిన యెడల జరిమానాను  ప్రస్థుతం వున్న రూ. 1,000 నుండి రూ. 5,000కు పెంచడం జరిగింది. 
  • కొన్ని రకాల రోడ్డు  ప్రమాదాలకు, భారతదేశంలో వున్న అన్ని రహదారి వినియోగదారులకు "మోటారు వాహన ప్రమాద నిధి" నుండి  నిర్బంధ బీమాను అందచేయడం జరుగుతుంది. 
  • దివ్యంగులు  కొరకు ప్రతేయక వాహనములు తయారు చేయుట తప్పనిసరి
  • కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు మరియు పౌర సంస్థలు ప్రమాద రహిత రూపకల్పన, నిర్మాణానికి లేదా ప్రమాదానికి దారితీసిన రహదారుల నిర్వహణకు బాధ్యత వహిస్తాయి.
  • రహదారి ప్రమాదానికి సంబంధించి క్లెయిము ట్రిబ్యునళ్లు  పరిహార దరఖాస్తు కొరకు ఆరు నెలల కాల వ్యవధిని ఇవ్వడం జరిగింది.
  • ఈ బిల్లు మూడవ పార్టీ నుండి  లభించే గరిష్ట భీమా పరిమితిని తొలగిస్తుంది. 2016 బిల్లు మరణం సంభవించిన యెడల గరిష్ట పరిమితిని  10 లక్షల రూపాయలుగా , తీవ్రంగా గాయపడిన యెడల 5 లక్షల రూపాయలు గా నిర్ధారించింది.  
  • ఒకసారి లైసెన్సు పొందిన  తరువాత, దానిని పున్నరుద్దించడం సాధారణంగా ప్రజలు మర్చిపోతారు. లైసెన్స్  పునరుద్ధరణ కు ఒక నెల చాలా తక్కువ సమయం, కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ పరిమితి గడువు ఒక నెల నుండి ఒక సంవత్సరం వరకు పెంచబడుతుంది.
  • వాహనాల్లో అవసరమైన భాగాల నాణ్యతలో రాజీ కొన్ని ఘోరమైన సంఘటనలు మరియు పర్యావరణ క్షీణతకు దారి తీయవచ్చు. అందుకు ఈ  చట్టం లో ఒక ప్రత్యేక విభాగం కలిగి ఉంది, దీనిలో ప్రభుత్వం అవసరమైన వాహనాల యొక్క భాగాలను లేదా ఇంజిన్లకు తగిన ప్రమాణాలను పాటించని వాహనాలను గుర్తిస్తుంది . సరైన  ప్రమాణాల తో ఇంజిన్ల తయారు చేయని యెడల తయారీదారులుకు రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు.
  • మోటార్ వాహనముల చట్టము, 1988 మరియు మోటార్ వాహనముల సవరణ చట్టము, 2017 మధ్య పోలికలు, వ్యత్యాసాలు  :


కారకాలు
మో.వా.చ. 1988
మో.వా.చ. 2017
డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్ను  పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి
కాదు
అవును
హిట్-అండ్-రన్ కేసులలో మరణాలకు పరిహారం
రూ .25,000
రూ .2,00,000
మద్యం సేవించి  వాహనం నడిపిన యెడల కనీస జరిమానా
రూ .2,000
రూ .10,000
రాష్ డ్రైవింగ్ కోరకు జరిమానా
రూ .1,000
రూ .5,000
లైసెన్సు లేకుండా వాహనం నడిపిన యెడల కనీస జరిమానా
రూ. 500
రూ. 5000
అతి  వేగంకు పాల్పడిన యెడల జరిమానా
రూ. 400
రూ. 1000
దివ్యంగులు  కొరకు ప్రతేయక వాహనములు తయారు చేయుట తప్పనిసరి
కాదు
అవును
డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ పరిమితి గడువు
ఒక నెల
ఒక సంవత్సరం
సరైన  ప్రమాణాల తో  ఇంజిన్ల తయారు చేయని యెడల  తయారీదారులుకు జరిమానా
వివరించబడలేదు
రూ. 500 కొట్లు

కావున  పాత మోటార్ వాహనముల చట్టము మరియు ప్రతిపాదించిన సవరణల చట్టము మధ్య భారీ వ్యత్యాసం ఉన్నదని సులభంగా గమనించవచ్చు. లోక్ సభ  ప్రతిపాదించిన సవరణలను ఆమోదించింది, అయితే రాజససభ లో ఇది ఇంకా ఆమోదింపబడలేదు . రహదారి ప్రమాదాలు కారణంగా సంభవించే మరణాల సంఖ్య తగ్గించేందుకు  ఈ బిల్లు ఆమోదంతో పాటు, వచ్చే మార్పులన్నీ కీలకమైనవి కావచ్చు.


No comments:

Post a Comment